కరోణా వైరస్ దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం లో 59 రోజుల పాటు ఆర్టీసి బస్సులు డిపోకే పరిమితం కాగా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఆర్టీసి సేవలకి సడలింపు ఇచ్చిన నేపధ్యంలో జనగామ డిపోకు చెందిన 125 ఆర్టీసి బస్సులు నేటి నుంచి రోడ్డు ఎక్కాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు బస్సు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి నిబంధన పాటించకుంటే 1,000 రూపాయలు జరిమానా తప్పదని ఆర్టీసి డిఎం ధరమ్ సింగ్ తెలిపారు. ప్రతీ బస్సులో శానిటైజేషన్ చేసి ప్రయాణికులు బౌతిక దూరం పాటించేలా చూసుకోవాలని ఆర్టీసి సిబ్బందిని ఆదేశించారు కాగా వారం రోజుల ముందు నుంచే ఆర్టీసి టెక్నికల్ సిబ్బంది బస్సుల ఫిట్ నెస్ ను పరీశిలించి ప్రయాణికులను భద్రంగా వారి గమ్యస్థానాలకు చేర్చే విధంగా బస్సులను సిద్దం చేశారు.
Comments