జఫర్ ఘడ్ గ్రామంలో ఉపాధి హామీ పధకం పనులు ప్రారంభం
జఫర్గడ్ మండల కేంద్రంలో
కరోన నియంత్రన లో బాగంగా గత నెల రోజులుగా లాక్ డౌన్ ఉండడంతో గ్రామాల్లో ఉపాధి లేక ఉపాధి కూలీలు ఆర్ధిక ఇబ్బందులకు గురి అవుతున్నారు. కేంద్రం చేసిన కొన్ని సడలింపులలో బాగంగా జఫర్ ఘడ్ గ్రామంలో ఉపాధి హామీ పధకం పనులు ప్రారంబించారు. గ్రామంలో 900ల జాబ్ కార్డ్ లు ఉండగా, 200 మంది కూలీలలు గ్రూపులు గా ఏర్పాటు చేసుకుని సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు దరించి ఉపాధి హామీ పనులు నిర్వహిస్తునారు. ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ మాట్లడుతూ కరోన లాక్ డౌన్ నేపధ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతునున్న వారికి ఉపాధి పనులు ప్రారంభమవడంతో ఉపాధి కూలీలు వారికి ఇచ్చిన ఉపాధి పనులను చేస్తున్నారని, వచ్చిన కూలి డబ్బులు వారికి ఉపయోగంగా ఉంటాయని తెలిపారు.
Comments