లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించిన వాహనాలు వాపస్
లింగాల గణపురం మండల
కేంద్రంలో లాక్ డౌన్ నియమాల ఉల్లంఘనలో
సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచిన వాహనాలను తిరిగి యజమానులకు ఇచ్చిన ఎస్ఐ సంతోషం
రవీందర్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాల యాజమాన్యాల నుండి
డిక్లరేషన్ ఫామ్, సెక్యూరిటీ
బాండ్, ఆర్ సి, డ్రైవింగ్
లైసెన్స్ ల జిరాక్స్ తీసుకుని దాదాపుగా ఇప్పటివరకు 70 వాహనాలను ఇచ్చామన్నారు, ప్రభుత్వాలు పూర్తిగా లాక్ డాన్ ఎత్తి వేయలేదని, టు వీలర్ పై ఒకరు, ఫోర్
వీలర్ పై ఇద్దరికి మాత్రమే అంగీకారం ఉందన్నారు, ఈ
నియమాన్ని అధిగమిస్తే మాత్రం వాహనాన్ని సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తామన్నారు, అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దన్నారు.

Comments