ఒక్క తల్లి తండ్రికి పుట్టిన వాళ్లయితే తల్లి రొమ్ము కోసే ప్రయత్నం చేయొద్దు - ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని TRS పార్టీ కార్యాలయంలో తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా TRS పార్టీ జెండా ఆవిష్కరణలో ఆవేశంగా ప్రసంగించారు. ఎమ్మెల్యే రాజయ్య అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గానికి ఎవరు రావాలన్న తన అనుమతి తీసుకోవాలని, నియోజవర్గానికి తండ్రి, మంత్రి తానే అని, ఒక్క తల్లి, తండ్రికి పుట్టిన వాళ్లయితే, తల్లి రొమ్ము కోసే ప్రయత్నం చేయొద్దని ఆయన హెచ్చరించారు. కరోనా వ్యాప్తి నివారణకు నియోజకవర్గంలో కొందరు ఇటీవల హైదరాబాద్ లో చెక్కులు ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో చెక్కులు ఇస్తే సముద్రంలో పోసినంత సమానము అని ఎమ్మెల్యే రాజయ్య కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు, నా నియోజకవర్గం లో ఎవరూ ఏలు పెట్టొద్దు, కాలు పెట్టోద్దు అన్న ఎమ్మెల్యే రాజయ్య పరోక్షంగా కడియంను ఉద్దేశించి మాట్లాడారు. మరీ పార్టీ హై కమాండ్ ఏం చేస్తుందో చూద్దాం!


Comments

You are welcome to share your ideas with us in comments!