రెడ్ హ్యాండెడ్ గా దొరికిన అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు
దేవరుప్పుల మండలం
కోలుకొండ గ్రామ వాగు నుండి అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది ఇసుక ట్రాక్టర్లను
మైనింగ్ ఆర్ఐ, తహసిల్దార్ పర్వుద్దీన్ , ఎస్సై
రామారావులు సీజ్ చేసారు. అనంతరం మీడియాతో సీఐ రమేష్ మాట్లాడుతూ కోలుకొండ వాగు
నుండి ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను మైనింగ్
ఆర్ఐ, తాసిల్దార్, ఎస్ఐలు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్రమంగా ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి
పోతున్నందున అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, బైండోవర్
చేసి, కేసు నమోదు చేసి, మూడు లక్షల రూపాయల జరిమానా విధించబడుతుందని, ఇసుక
ట్రాక్టర్ల యజమానులను సిఐ రమేష్ హెచ్చరించారు.

Comments