450 కుటుంబాలకు నిత్యావసరాల సరుకుల పంపిణీ
జనగామ
జిల్లాలో రెడ్ జోన్ గా ఉన్న బండనాగారం గ్రామంలోని 450 కుటుంబాలకు జయశంకర్ సార్ సేవా సమితి చైర్మన్
కొత్తపల్లి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసరాల సరుకుల పంపిణీ వాహనాలను డిసిపి
శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంధర్బంగా డిసిపి మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో
విధించిన లాక్ డౌన్ లో ప్రొపెసర్ జయశంకర్ సార్ సేవా సంస్థ బియ్యం నిత్యావసరాల
వస్తువులను పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. చైర్మన్ కొత్తపల్లి సతీష్
మాట్లాడుతూ లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు నియోజక వర్గ వ్యాప్తంగా నిరుపేదలకు, వలస కూలీలకు, నిత్యావసర సరకులను అందిస్తామని తెలిపారు. ఈ
కార్యక్రమంలోఎసిపి వినోద్ కుమార్, సిఐ మల్లేష్, ఎస్సై రఘుపతి, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
Comments