200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీ

200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీ


లింగాలఘణపురం మండలం మాణిక్యపురం గ్రామంలో గ్రామ పంచాయతీ అధ్వర్యంలో 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పంపిణీ చేసిన అనంతరం ఒగ్గు రవి ఆధ్వర్యంలో కరోణా వైరస్ నివారణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒగ్గు కథ రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు కరోణా వైరస్ మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సాన్ని, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఒగ్గు కథ రూపంలో అవగాహన కల్పిస్తున్న ఒగ్గు రవి కళా బృందాన్ని అభినందించారు.

Comments

You are welcome to share your ideas with us in comments!